చుట్టాలు... చాలా మంది చుట్టాలు వచ్చి వెళ్లారు. పాతిక మందికి వండి పెట్టటం కష్టమే. అమ్మకు అంత ఓపిక ఎక్కడనుంచి వస్తుందో అర్ధం కాదు..! ఒళ్ళు హూనమింది.. తలకి కొబ్బరి నూనె పెట్టి, నాలుగు బాల్చీల వేడి నీళ్ళతో స్నానం చేసి, ముట్టన్ కూర బన్నుతో తిని, బాల్కనీ లో పడుకొని పాత పాటలు వింటున్నాను.. చాలా ఆహ్లాదకరంగా ఉంది..
ఊహలు గుసగుసలాడే.. పాడుతా తీయగా చల్లగా.. శివ శంకరీ... ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఇది మల్లెల వేళయని.. స్నేహానికన్న మిన్న ఈ లోకాన లేదురా..
ఇలాంటి సాహిత్య, సంగీత, సంస్కార ప్రధానమైన పాటలు ఈ తరంలో కూడా వస్తే బాగున్ను..!!
cant understand :-(.. need to learn telgu.. so plz teach telgu first.. :-)
ReplyDeleteOK. come to tution from today. 20% discount to u. 1600 INR only per month.
ReplyDelete