Sunday, June 5, 2011

వానోచ్చింది...

వానోచ్చింది... ఈసారి మూడు రోజుల ముందే రుతుపవనాలు వచ్చేసాయి. తెల్ల మబ్బులు, నల్ల మబ్బులు.. ఇంట్లో అమ్మ, నాన్న దగ్గర ఉండాలనుంది.. అమ్మ చేసిపెట్టే వేడి వేడి బజ్జీలు తిందామని కాదు.. ఇద్దరం బయట మెట్ల మీద కుర్చుని వానలో చేతులాదిస్తూ అల్లరి చేస్తుంటే ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది...
వర్షపు చినుకులు కాళ్ళపై పడుతుంటే ఏదో తెలియని ఉల్లాసం. మనసు వేటూరి గారి మనసా తుళ్ళిపడకే పాట పాడుతోంది.. ఎగిరిపోవాలనుంది... ఎక్కడికైనా, ఎవరు లేని చోట వానలో తడుస్తూ, చెరువు లో ఆడుకోవాలి... భట్ఘర్ జలాశయం ఐతే సరి.. 

నే పోతున్న... మీరేం చేస్తున్నారు..! తొలకరి జల్లులు మళ్లి మళ్లి రావు...! పండగ చెయ్యండి..

No comments:

Post a Comment